ప్రభాస్​ -నాగ్​ అశ్విన్​ మూవీ షూటింగ్ షురూ.. !

బాహుబలి తర్వాత ప్రభాస్​ రేంజ్​ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్​ సినిమాలకు పాన్​ఇండియా స్థాయిలో మార్కెట్ పెరిగిపోయింది. దీంతో ప్రభాస్​ ముంబైలో ఉంటూ హిందీలో కూడా తన రేంజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్​ షూటింగ్​ చివరిదశకు చేరుకున్నది. పీరియాడికల్​ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. పూజాహెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది.

ఇక దీని తర్వాత బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ దర్శకత్వంలో ఆదిపురుష్​ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్నాడు ప్రభాస్​. ఈ సినిమాలో ప్రభాస్​ సరసన సీతగా కృతి సనన్​ నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్​ అలీఖాన్​ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్​తో ఈ మూవీ రూపొందుతోంది. అలాగే కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో సలార్​ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతోందట.

ఇదిలా ఉంటే ప్రభాస్​తో ఓ భారీ ప్రాజెక్ట్​ను అనౌన్స్​ చేశారు.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్​. ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్​ నాగ్​అశ్విన్​ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్​ నటి దీపికా పదుకొనేను హీరోయిన్​గా ఎంపికచేశారు. ఇవాళ ఈ ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం. మొత్తానికి ప్రభాస్​ నటించే మరో పాన్ ఇండియా మూవీ మొదలు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read

భీమ్​ విషయం ఓకే.. మరి అల్లూరి సంగతేంటి?

రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

సార్​ మీ కులపోడినే.. కొద్దిగా చాన్స్​ ఇవ్వరూ..!

Related Articles

Most Populer

Recent Posts