Sunday, May 19, 2024
- Advertisement -

ఆరో రౌండ్లో కేసిఆర్ కారు దూసుకొచ్చింది… కానీ..!

- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఆరు రౌండ్లు ముగిసేసరికి బిజేపి అభ్యర్థి రఘునందన్​రావు 2,667 ఓట్ల ముందంజలో ఉన్నారు.

ఆరో రౌండ్లో తెరాస 353 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బిజేపి-20,226, తెరాస-17,559, కాంగ్రెస్‌-3,254 ఓట్లు వచ్చాయి. తొలి 5 రౌండ్ల వరకు బిజేపి ఆధిపత్యం చెలాయించింది. ఆరో రౌండ్​లో మాత్రం తెరాసకు ఆధిక్యం లభించింది.23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

టీడీపీ ని తల్లి కొడుకులు పూర్తి గా వదిలేసినట్లేనా..?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

జగన్ బీజేపీ పై ఎప్పుడు వత్తిడి తెస్తారో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -