Thursday, March 28, 2024
- Advertisement -

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

- Advertisement -

భారీ హైప్ తో వచ్చి ప్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో మరి ఎక్కువ లాస్ తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అజ్ఞాతవాసి : పవన్-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అజ్ఞాతవాసి కాపీ వివాదాన్ని కూడా మూటగట్టుకొని ..త్రివిక్రమ్ కి చెడ్డ పేరుతెచ్చింది

బ్రహ్మోత్సవం : మహేష్ హీరోగా, భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీస ఆదరణ దక్కించుకోలేక మహేష్ చిత్రాలలో అత్యంత చెత్త చిత్రంగా నిలిచి.. పెట్టిన బడ్జెట్ కూడా సాధించలేకపోయింది.

శక్తి : ఎన్టీఆర్ తో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి టాలీవుడ్ బడా ప్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా భారీ నష్టాలను మిగిల్చింది.

తుఫాన్ : చరణ్ కెరీర్ లో ఈ చిత్రం చెత్త మూవీగా నిలిచింది. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ మరియు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదలై భారీ ప్లాప్ గా నిలిచింది.

రెబల్ : వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో రెబల్ షాక్ ఇచ్చింది. లారెన్స్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఒక్క మగాడు : బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒక్క మగాడు ఒకటి. వై వి ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ మూవీ భారతీయుడు మూవీకి కాపీ అన్న అపవాదు మూటగట్టుకుంది.

స్పైడర్ : స్పైడర్ మహేష్ కెరీర్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాలలో ఒకటి. మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ కనీస ఆదరణ దక్కించుకోలేక భారీ నష్టాలు మిగిల్చింది.

కొమరం పులి : ఎస్ జె సూర్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన కొమరం పులి భారీ ప్లాప్ గా నిలిచింది.

అఖిల్ : అక్కినేని వారసుడు అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ భారీ అంచనాల మధ్య వచ్చింది. వి వి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయం మూటగట్టుకొని..నష్టాలు మిగిల్చింది.

ప్రభాస్ మూవీకోసం అమితాబ్ కి ఎంత ఇస్తున్నారో తెలుసా ?

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

ఎస్పీ బాలు గారి చివరి పాట పారితోషకం ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -