Wednesday, April 24, 2024
- Advertisement -

రికార్డ్ స్థాయిలో పెరిగిన భాగ్యనగర పెట్రోల్ ధరలు..!

- Advertisement -

కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత చమురు ధర చుక్కలనంటుతుంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు చూస్తుంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొంత మంది వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఎదురవుతుంది.

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు పెరిగాయి. ఆది, సోమవారాల్లో ఎలాంటి పెరుగుదల లేకపోగా…మంగళవారం మళ్లీ చమురు సంస్థలు ధరలు పెంచాయి. పెట్రోలుపై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ లీటరు పెట్రోలు ధర 94రూపాయల 54పైసలు, డీజిల్‌ ధర 88రూపాయల 69పైసలకు చేరింది.

ఈ నెల ఒకటో తేదీ ధరలతో పోలిస్తే హైదరాబాద్‌లో పెట్రోల్‌ డీజిల్‌పై సుమారు 5 రుపాయలు పెరిగింది. ఈ నెల ఒకటిన పెట్రోల్‌ ధర 89 రూపాయల 77పైసలు, డీజిల్‌ ధర 83రూపాయల 46పైసలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను దృష్ట్యా…..ప్రస్తుతం రోజువారీగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.

వైఎస్ షర్మిల నయా ప్లాన్.. గిరిజన తోడ్పాటు నాయకులతో భేటీ..!

ట్రాన్స్ జెండ‌ర్ గా విజ‌య్ సేతుప‌తి !

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -