Saturday, April 27, 2024
- Advertisement -

పెంక్షన్ల పెంపు.. జగన్ సర్కార్ హామీ అమలు !

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సలు దాటిపోయింది. ఈ మూడున్నర కాలంలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశామని జగన్ సర్కార్ జబ్బలు చారుస్తూ చెప్పుకొస్తోంది. ఎంతవరకు ఏ ప్రభుత్వం కూడా మూడేళ్ళ కాలంలో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేయలేదని.. ఇదంతా కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే సాధ్యమైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో పెంక్షన్ల పెంపు కూడా ఒకటి. రూ. 2000 వేల రూపాయలు ఉన్న పెంక్షన్ ను దశలవారిగా రూ.3 వేలు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. .

అందులో భాగంగానే ప్రతి ఏడాది కూడా రూ.250 పెంచుతూ వస్తున్నారు సి‌ఎం జగన్. ఇక ఇప్పటికే 2500 రూపాయల వరకు పెంచిన జగన్ సర్కార్. వచ్చే ఏడాదికి గాను పెంక్షన్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. 2500 రూపాయలు ఉన్న పెన్షన్ ను రూ.2750 కి పెంచుతున్నట్లు నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది జగన్ సర్కార్. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేయనుంది జగన్ సర్కార్. అయితే ఈ పెంక్షన్ల పెంపును ఒకే సారి పెంచే అవకాశం ఉందని ఎన్నికల ముందు అంతా భావించారు. కానీ తీర అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా పెన్షన్ పెంచుతామని జగన్ ప్రమాణ స్వీకారం రోజు చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ ప్రజలు షాక్ గురయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పటికే మూడు సార్లు పింఛన్ల పెంపు చేపట్టిన జగన్ సర్కార్.. చివరగా 2024 జనవరిలో రూ.3000 రూపాయలు చేయనున్నారు. మారి పెంక్షన్ లబ్దిదారులు వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ కు ఎంతవరకు అండగా నిలబడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

వైసీపీపై కుట్ర.. జరుగుతోందా ?

పొత్తులపై జనసేన క్లారిటీ.. 

వన్స్ మోర్ జగన్.. 2024 ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -