Wednesday, May 15, 2024
- Advertisement -

క‌ర్నూలులో విషాదం… ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి

- Advertisement -

ఏపిలో ఈ మద్య కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా కట్టడి కోసం సీఎం జగన్ ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కర్నూలులో కే ఎస్ కేర్ ఆస్పత్రిలో ఇవాళ ఆక్సిజ‌న్ అంద‌క ఆ కోవిడ్ బాధితులు ప్రాణాలు వ‌దిలారు.. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ ఆస్ప‌త్రిలో కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్న ఎన్టీఆర్!

ఎటువంటి అనుమతులు లేకుండానే రోగులకు కోవిడ్ వైద్యం చేస్తున్నారని తెలియడంతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆస్పత్రిపై విచారణకు ఆదేశించారు. కర్నూలు కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ విచారణ ప్రారంభించింది. అయితే ఒక్కసారిగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో మిగిలిన పేషెంట్లలో భయాందోళనలు నెలకొన్నాయి.

నా శాఖను కేసీఆర్ బదిలీ చేశారని తెలిసింది.. చాలా ఆనందం : ఈటెల

ఆక్సిజన్ లేక ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తడంతో.. పేషెంట్లు వేరే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన జరిగిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వెంటనే విచారణ చేపట్టాల్సిందా అధికారులను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -