Monday, May 20, 2024
- Advertisement -

అంగళ్లు కేసులో రిలీఫ్.. సుప్రీంలో ఏం జరగబోతోంది?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు అంగళ్లు కేసులో రిలీఫ్ లభించింది, ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదుచేయగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు చంద్రబాబు. హైకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వాదనలు ముగియడంతో షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. బెయిల్‌ షరుతుల్లో భాగంగా రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది న్యాయస్ధానం. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పిటిషన్‌ని ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఇక ఇదే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంలో విచారణ జరగనుంది. హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఇవాళ సుప్రీం ఎలాంటి తీర్పునిస్తుందోనని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు.

ఇవాళ సీఐడీ తరపున మరోసారి వాదనలు వినిపించనున్నారు రోహిత్గీ. వాదనలు పూర్తైన తర్వాత సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండగా ఈసారి చంద్రబాబుకు బెయిల్ రావడం పక్కా అనే ధీమాలో లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -