Tuesday, May 21, 2024
- Advertisement -

లోకేష్ నోటీసుల్లో హెరిటేజ్‌ ప్రస్తావన..దానికోసమేనా!

- Advertisement -

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో నారా లోకేష్‌ పేరును ఏ14గా ఏపీ సీఐడీ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఏ6గా హెరిటేజ్‌ని చేర్చగా లోకేష్‌కు ఇచ్చిన నోటీసుల్లో హెరిటేజ్‌కు సంబంధించిన కీలక విషయాలను ప్రస్తావించింది. హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్ ని చెప్పాలని అడిగినట్లు సమాచారం.

హెరిటేజ్ తరఫున కొన్న భూముల లావాదేవీల వివరాలు ప్రస్తావించారని తెలుస్తోంది. అక్టోబర్ 4న విచారణకు రావాల్సిందిగా లోకేష్‌ సూచించమే కాదు కోర్టు ముందు కూడా లోకేష్ హాజరు కావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక నారా లోకేష్ తన నోటీసులు తీసుకున్నారని ఆయనకు సెక్షన్ 41ఏ మీద వివరణ ఇచ్చామని కూడా తెలిపారు. సీఐడీ ఇచ్చిన నోటీసుల మీద నారా లోకేష్ తన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అలాఏగు నోటీసుల్లో భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, ఈ కేసు సంబంధించిన ఎవిడెన్స్‌ను ఏవిధంగానూ ట్యాంపరింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులను ప్రలోభపెట్టటం గానీ, బెదిరింపులకు గురి చేయటం గానీ చేయకూడదని వెల్లడించారు. ఎప్పుడు అవసరముంటే అప్పుడు విచారణకు హాజరై, అధికారులకు సహకరించాల్సి ఉంటుందని…. విచారణ సమయంలో నిజానిజాలను పూర్తి పారదర్శకంగా చెప్పాల్సి ఉంటుందన్నారు.

విచారణ సమయంలో.. హెరిటేజ్ ఫుడ్స్‌ సంస్థకు సంబంధించిన లావాదేవీలను, భూముల లావాదేవీల విషయంలో బోర్డు మీటింగ్స్‌కు సంబంధించిన మినిట్స్ బుక్‌ను, భూముల కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్ వివరాలను.. సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో హెరిటేజ్‌ సంస్థ ఛైర్మన్‌గా భువనేశ్వరి,ఎండీగా బ్రాహ్మణీ ఉండటంతో వీరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నారా ఫ్యామిలీ మొత్తం అవినీతి కేసుల్లో చిక్కుల్లో పడటం ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -