Tuesday, May 21, 2024
- Advertisement -

లోకేష్ ముందస్తు బెయిల్..బిగ్ షాక్!

- Advertisement -

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ని డిస్పోజ్ చేసింది. కేసులో విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించింది. దీంతో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి..

ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేష్‌కు 41 ఏ నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులను స్వయంగా ఆయనకే ఇచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరారు ఏపీ సీఐడీ అధికారులు. అలాగే తమ వెంట చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఫైల్స్‌ను కూడా తీసుకెళ్లారు సీఐడీ అధికారులు.

ఇక కోర్టు సూచన మేరకే ముందుకు వెళ్తున్నామని…ఒకవేళ విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువస్తామని ఏజీ చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నారా లోకేష్‌‌ను ఏ14గా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే లోకేష్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకేష్‌కు మాత్రం షాకే తగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -