Tuesday, May 21, 2024
- Advertisement -

బ్రాహ్మణి..పొలిటికల్ ట్రైనింగ్‌!

- Advertisement -

రాజకీయ పార్టీలు శిక్షణా తరగతులను పెట్టడం కామనే. తమ పార్టీ విధానాలను కార్యకర్తలకు వివరించడం, పార్టీకి క్రమశిక్షణ కలిగిన వారిలా తయారు చేయడం పొలిటికల్ ట్రైనింగ్ ఉద్దేశం. అయితే ఇప్పటికవరకు ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తలకు,అదికాకపోతే నేతలకు శిక్షణ ఇచ్చింది. కానీ తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ తమకు కాబోయే నాయకురాలికి ట్రైనింగ్ ఇస్తోంది. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, తర్వాత ఆయన తనయుడు లోకేష్ అరెస్ట్ కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, ఫైబర్ నెట్ స్కాంలలో లోకేష్ పేరును చేర్చగా ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం నోటీసు ఇచ్చేందుకు హస్తినకు సైతం వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.

ఈ నేపథ్యంలో పార్టీకి పెద్దదిక్కుగా మారారు బ్రాహ్మణి. జైలు నుండి చంద్రబాబు గైడెన్స్‌తో ముందుకుసాగనున్నారు బ్రాహ్మణి. ఇందుకు అవసరమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. లోకేష్ అరెస్టయిన వెంటనే బ్రాహ్మణి రంగంలోకి దిగనున్నారట. అంటే లోకేష్‌కి బదులుగా బ్రాహ్మణి పాదయాత్ర చేయనున్నారు. వైసీపీ నేతలు ప్రధానంగా టార్గెట్ చేసే అంశాలు వాటిని ఏ విధంగా ఎదుర్కొని మాట్లాడాలి అన్నదానిపై నిర్ధిష్టమైన సమాచారంతో బ్రాహ్మణికి వివరిస్తున్నారని సమాచారం. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల అసలు స్వరూపం ఏంటి, దానికి టీడీపీకి సంబంధం లేదని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో పూసగుచ్చినట్లు వివరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా లోకేష్‌కు భాష సమస్య ఉండేది. ఇప్పటికి లోకేష్‌ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అయితే బ్రాహ్మణి విషయంలో అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

మొత్తంగా ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో బ్రాహ్మణితో ప్రచారం చేయిస్తే కలిసి వస్తుందని భావిస్తున్న టీడీపీ నేతలకు ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -