Saturday, May 18, 2024
- Advertisement -

అరకు..కిడారి వర్సెస్ దొన్ను దొర!

- Advertisement -

ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ జిల్లాలోని అన్ని స్ధానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ వ్యూహ రచన చేస్తుండగా టీడీపీ మాత్రం అంతర్గతపోరుతో ఇబ్బంది పడుతునే ఉంది. తాజాగా అరకు టీడీపీలో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్‌కు అరకు టీడీపీ ఇంఛార్జీగా ఉన్న సియ్యారి దొన్ను దొరకు మధ్య ఇంటర్నల్ ఫైట్ నడుస్తోంది.

ఈ సారి అరకు టికెట్ దొన్ను దొరకే అని ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు శ్రవణ్. ఇక వీరిద్దరి మధ్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు.

కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారు. అయితే తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మావోయిన్టులు ఆయన్ని చంపేశారు. ఈ సెంటిమెంట్‌ను క్యాచ్ చేసుకోవాలని భావించిన చంద్రబాబు…సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌కు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి తప్పలేదు. అయితే అప్పటివరకు వైసీపీలో ఉన్న దొన్ను దొర టీడీపీలో చేరడంతో ఆయన్ని ఇంఛార్జీగా ప్రకటించారు చంద్రబాబు. దీంతో శ్రవణ్ ఆశలపై నీళ్లు పోసినట్లైంది. ఇప్పుడు ఇదే ఎన్నికల ముందు అంతర్గతపొరుగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -