Tuesday, April 30, 2024
- Advertisement -

అరకు టీడీపీ..రెబల్ అభ్యర్థిగా దొన్ను దొర

- Advertisement -

ఏపీ టీడీపీలో రెబల్ అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించిన అసంతృప్తులు మాత్రం తగ్గెదేలే అంటున్నారు. తాజాగా అరకు టీడీపీ ఇంఛార్జీ దొన్ను దొర తిరుగుబాటు జెండా ఎగురచేశారు. తన అనుచరులతో సమావేశం అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన దొన్ను దొర..చంపడానికైనా చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. వాస్తవానికి తొలుత టీడీపీ అభ్యర్థిగా దొన్ను దొరనే ప్రకటించారు చంద్రబాబు. అయితే తర్వాత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు దొన్ను దొర.

2019లో ఫార్వార్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన దొన్ను దొర 27 వేల ఓట్లు సాధించారు. ఈసారి కూడా ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతుండటంతో టీడీపీకి గట్టి షాక్ తగలడం ఖాయమని భావిస్తున్నారు. ఎందుకంటే 2014,2019లో అరకు స్థానంలో విజయం సాధించింది వైసీపీ. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -