Monday, May 20, 2024
- Advertisement -

జనసేన పోటీ చేసే స్ధానాలివే!

- Advertisement -

తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 8 స్ధానాలు కేటాయించింది బీజేపీ. ఇందులో ఖమ్మం, అశ్వరావుపేట, వైరా, కొత్తగూడెంతో పాటు నాగర్ కర్నూల్, కోదాడ, కూకట్ పల్లి, తాండూర్ స్థానాలు ఉన్నాయి.

ఇక శేరిలింగంపల్లి స్థానంపై బీజేపీ – జనసేన మధ్య జగడం కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఈ సీటు జనసేనకు కేటాయిస్తే బీజేపీకి షాక్ తగలడం ఖాయం. ఎందుకంటే ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రావు. ఒకవేళ ఈ స్థానాన్ని జనసేనకు ఇస్తే ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనిపై బీజేపీ – జనసేన నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

ఇప్పటివరకు బీజేపీ మూడు జాబితాలు విడుదల చేయగా మొత్తం 88మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రేపో, ఎల్లుండో పూర్తి జాబితాను రిలీజ్ చేయనుంది బీజేపీ. ఇక ఈ సారి ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తుండం ప్రాధాన్యత సంతరించుకోగా అది బీజేపీకి ఏ మేరకు కలిసివస్తుందో వేచిచూడాలి. మరోవైపు టీటీడీపీ ఎవరికి మద్దతిస్తుంది అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కా లేక బీజేపీ – జనసేన కూటమికా అన్న ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -