Thursday, May 16, 2024
- Advertisement -

విజయనగరం ఎంపీ రేసులో కొత్త పేరు?

- Advertisement -

గెలుపు గుర్రాలకే టికెట్లు..ఇదే ప్రాతిదికన ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థుల మార్పుకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేయగా తాజాగా ఇవాళ, రేపు మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఎవరికి టికెట్ వస్తుంది..?ఎవరికి టికెట్ రాదోనని అంతా టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు.

సిట్టింగ్‌ల మార్పు నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు వ్యాలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించనుండగా విజయనగరం ఎంపీ విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట జగన్.ప్రస్తుతం విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉండగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తుండగా ఈ స్థానం నుండి బొత్స కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది.

ఇందులో భాగంగా విజయనగరం జడ్పీ ఛైర్మన్‌, బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్‌ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే శ్రీనివాస్ పోటీ చేయాలని భావించినా ఛాన్స్‌ దక్కలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ రావు పోటీ చేయనుండగా ఆయన బరిలో ఉంటే ఈ ఎంపీ సెగ్మంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఎంపీ చంద్రశేఖర్‌ను ఎచ్చర్ల అసెంబ్లీ నుండి పోటీ చేయించాలని భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -