Tuesday, April 30, 2024
- Advertisement -

విజయనగరంలో వీర తిలకం వైసీపీకే!

- Advertisement -

విజయనగరం ఎంపీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే వ్యాపార, వాణిజ్య కేంద్రానికి కేరాఫ్‌గా మారిన ఇక్కడ గెలిచి సత్తాచాటాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. బొబ్బిలిరాజులు, అశోక గజపతిరాజు, బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావ్ వంటి నేతలు ఈ నియోజకవర్గం నుండే గెలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

2009లో విజయనగరం పార్లమెంట్‌ స్థానం ఏర్పడగా 2009లో బొత్స ఝాన్సీలక్ష్మి, 2014లో అశోక్‌ గజపతిరాజు, 2014లో బెల్లాన చంద్రశేఖర్‌ విజయం సాధించారు. ఈసారి వైసీపీ తరపున బెల్లాన పోటీ చేస్తుండగా టీడీపీ తరపున కలిశెట్టి అప్పలనాయుడు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కేంద్రమంత్రిగా ఉన్న అశోక్‌ గజపతిరాజును ఓడించిన బెల్లాన విజయం సాధించారు. ఈసారి కూడా గెలుపు తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే టీడీపీ అభ్యర్థికి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పరిచయాలు పెంచుకోవడమే కష్టంగా మారింది. దీనికి తోడు కళా వెంకట్రావ్‌తో విభేదాలు, జనసేన,బీజేపీతో పొత్తు సమస్య వెరసీ కలిశెట్టి చాలా కష్టపడాల్సి వస్తోంది. అయితే ఇప్పటివరకు విజయనగరం పార్లమెంట్ చరిత్రలో ఏ పార్టీ రెండోసారి గెలవలేదు. దీనిని ఈసారి బెల్లాన బ్రేక్ చేస్తుండటం ఖాయంగా కనిపిస్తుండగా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -