Saturday, May 18, 2024
- Advertisement -

జైల్లో బాబును అంతం చేసే కుట్ర..బెయిల్ కోసమేనా!

- Advertisement -

అవినీతి కేసుల్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ రావడం రోజురోజుకు క్లిష్టతరమవుతోంది. బెయిల్ కోసం బాబు లీగల్ టీం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో తీర్పును ప్రస్తావిస్తున్నారు, చంద్రబాబు వయస్సు, 14 సంవత్సరాల సీఎం అనుభవాన్ని ప్రస్తావనకు తెస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు భద్రతను ప్రత్యేకించి హైలైట్ చేస్తూ బెయిల్ వచ్చేలా ప్రయత్నిస్తున్న సీఐడీ తరపు లాయర్లు వాటిని సమర్ధవంతగా తిప్పికొడుతున్నారు.

వాస్తవానికి చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు పటిష్ట భద్రతతో కూడుకుంది. ఇక బాబుకు ఇంటి ఫుడ్‌తో పాటు మెడిసిన్స్ ఇస్తున్నారు. అలాగే ప్రత్యేక బ్యారక్‌ కేటాయించగా అందులో చంద్రబాబు ఒక్కరే ఉంటున్నారు. మిగితా ఖైదీలెవరిని బాబు ఉన్న బ్యారక్ చుట్టు వెళ్లనివ్వడం లేదు. సీఐడీ తరపు వాదిస్తున్న సుధాకర్ సైతం ఇదే అంశాన్ని న్యాయమూర్తికి వివరించారు. కానీ బాబు భద్రతా అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది బాబు లీగల్ టీమ్.

ఇప్పుడు తాజాగా నారా లోకేష్ సైతం బాబు భద్రత అంశాన్ని మరోసారి హైలైట్ చేశారు. చంద్రబాబును జైలులో అంతం చేసేందుకే సర్కారు కుట్ర పన్నుతోందని.. జైలు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.దీనికి లోకేష్ చెబుతున్న కారణం…జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడని…బాబు గారిని ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నారని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఇక లోకేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తుంటే టీడీపీ నేతలకే నవ్వుతెప్పిస్తోంది. ఎందుకంటే బాబును బయటకు తెచ్చేందుకు ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోతే దానికి చంద్రబాబుకు ఏమో అవుతుందని ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -