Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబుకు నో రిలీఫ్‌..

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్ దక్కడం లేదు. ఇప్పటికే బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో దాఖలు చేసినా అక్కడ చుక్కెదురైంది. అయితే ఈ నేపథ్యంలో సర్కొన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చంద్రబాబు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

జస్టిస్‌ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున వా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది సర్వోన్నత న్యాయస్థానం.

మరోవైపు సుప్రీంలో బాబుకు రిలీఫ్ దక్కతుందుని భావించిన టీడీపీ శ్రేణులు, చంద్రబాబుకు కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -