Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ – జనసేన ఎంపీ లిస్ట్ ఫైనల్..ప్రకటనే తరువాయి!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ దాదాపు ఫైనల్ అయింది. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో సందిగ్దం నెలకొనగా ఎంపీ సీట్లు మాత్రం దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 స్థానాలకే లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

13 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ కాగా 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరు ఎన్నారైలకు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, సంజయ్ కుమార్ లకు సీట్లు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని), విశాఖపట్నం – భరత్(గీతం విద్యాసంస్థల అధినేత,శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు(సిట్టింగ్ ఎంపీ),కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా సానా సతీశ్,మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి,నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు దాదాపు ఖరారు అయింది.

విజయనగరంలో సీటు బీసీలకు ఇవ్వనుండగా , అనకాపల్లి – బైరా దిలీప్, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, బుద్ధా వెంకన్న పేర్లు పరిశీలనలో ఉండగా అరకు- కిడారి శ్రావణ్ కుమార్, అమలాపురం – గంటి హరీశ్, సత్యశ్రీ , రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, ఎన్ఆర్ఐ యనమదల రవి పేర్లు పరిశీలనలో ఉండగా , ఏలూరు – గోపాలకృష్ణ యాదవ్(ఎన్ఆర్ఐ ),నర్సాపురం-రఘురామకృష్ణ రాజు,గుంటూరు – ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం రామకృష్ణ(భాష్యం విద్యా సంస్థల అధినేత),బాపట్ల – ఉండవల్లి శ్రీదేవి లేదా మాదిగ సామాజికవర్గ నేతకు ,ఒంగోలు లేదా నెల్లూరు స్థానాల నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి,తిరుపతి – పనబాక లక్ష్మి అంగలకుర్తి నిహారిక,చిత్తూరు – సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఆదిమూలం ,రాజంపేట – ,సుబ్రమణ్యం,కడప – శ్రీనివాస్ రెడ్డి,కర్నూలు – సంజీవ్ కుమార్ లేదా బీజేపీ నేత పార్థసారథి ,నంద్యాల- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుమార్తె శబరి,నంద్యాల – రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు,అనంతపురం – పూల నాగరాజు లేదా కాల్వ శ్రీనివాసులు,హిందూపురం- బీకే పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ లోనే అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -