Monday, May 13, 2024
- Advertisement -

మళ్లీ పాతపాటే..హస్తినకు కాంగ్రెస్ ఆశావాహులు!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఇప్పటికే 119 స్ధానాలకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్‌…అభ్యర్ధుల ఎంపికపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు భేటీ అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తర్వాత సీడ్యబ్లూసీ సమావేశాలు, భారీ బహిరంగసభ ఉండటంతో కొన్నిరోజులు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వేగాన్ని పెంచారు.

ఇవాళ గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరుగగా 40 నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్ లను స్క్రీనింగ్ కమిటీ డిసైడ్ చేసింది. ఇక త్వరలో తొలిజాబితా విడుదల కానుండగా ఈ లిస్ట్‌లో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు.

ఇమ మరో 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు. మిగిలిన చోట్ల ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థుల పోటీ పడుతున్నారు. దీంతో ఆశావాహులు ఢిల్లీ బాటపట్టారు. అధిష్టానం ద్వారా పైరవీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలోనే మకాం వేసి సీటుపై స్పష్టమైన హామీ తీసుకుంటున్నారు. ఇక టికెట్ దక్కని నేతలకు వారి స్ధాయిని బట్టి అధికారంలోకి వచ్చాక అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోగా తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -