Saturday, May 18, 2024
- Advertisement -

చేరికల ఎఫెక్ట్..టీ కాంగ్రెస్‌లో కల్లోలం!

- Advertisement -

బీఆర్ఎస్, బీజేపీల నుండి వరుస చేరికలతో హస్తం పార్టీ ఫుల్ లోడింగ్‌లో ఉంది. అయితే కొత్తగా వచ్చిన నేతలు – పాత నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఏఐసీసీ ఆదేశాలతో సీనియర్ నేతలు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. అన్ కండిషనల్‌గా ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకోవాలని తేలిపింది ఏఐసీసీ.

దీంతో దూకుడు మీదున్న ఈ కమిటీ పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ చేరికలను కొన్ని నియోజకవర్గాల్లో నేతలు వ్యతిరేకిస్తున్నారు. దేవరకద్రలో కాటం ప్రదీప్ కుమార్ గౌడ్‌ను సాయంత్రం చేర్చుకుంటే.. స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో చేరికను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక మిర్యాలగూడలోనూ ఇదు పరిస్థితి. ఆదిలాబాద్‌లో పార్టీ మాజీ నేతలు గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, రామచంద్రారెడ్డిల రాకను వ్యతిరేకిస్తున్నారు స్థానిక నేతలు. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికపై అలకపాన్పు ఎక్కారు జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల పర్వం ఎక్కడికి దారి తీస్తుందోనని హస్తం నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -