Saturday, May 4, 2024
- Advertisement -

పిఠాపురంలో వంగా గీత గెలుపు లెక్కలివే!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో గెలుపు ఎవరిదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీతా బరిలో ఉన్నారు. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు గీత.

కూటమి సపోర్టుతో పవన్ వస్తుండగా, వంగ గీత మాత్రం అభివృద్ధే మంత్రంగా బరిలో ఉన్నారు. ఈసారి పవన్‌ను ఓడించి తీరుతానని శపథం చేస్తున్నారు. అయితే కాపు ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వారు ఎటువైపు మొగ్గుచూపితే వారిదే విజయం. కానీ జనసేన,వైసీపీ ఇద్దరు అభ్యర్థులది కాపు సామాజికవర్గం కావడం విశేషం.

అయితే గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు గీత. పీజీ చదివిన ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా,ఎంపీగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ చదివింది పదిమాత్రమే. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే స్థానికంగా అందిరికి అందుబాటులో ఉండే వ్యక్తి గీత. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమెది ప్రత్యేక శైలీ. ఓపిగ్గా ప్రజలకు సమాధానం చెప్పడం గతంలో పిఠాపురం నుండే ఎమ్మెల్యేగా పనిచేయడంతో నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది.

కాపు ఓటర్ల సంగతి పక్కనపెడితే మిగిలిన కులాల్లో ఎస్సీలు, బీసీలు మైనారిటీలలో అత్యధిక శాతం ఓట్లు వైసీపీకి పడతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేపట్టిన సంక్షేమం ప్రతీ గడపకు చేరింది. ఇదే తన విజయానికి మరింత దోహదం చేస్తుందని వంగా గీత భావిస్తున్నారు. పవన్‌తో పోలీస్తే వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉండటంతో పవన్‌కు షాక్‌ తగిలిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయ వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -