Saturday, May 18, 2024
- Advertisement -

విశాఖలో బొత్సా గెలుపు మంత్రమిదే!

- Advertisement -

ఉత్తరాంధ్రలో మరోసారి తన పట్టు నిలుపుకునేందుకు తనదైన శైలీలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రధానంగా విశాఖ ఎంపీ స్థానంలో తన సతీమణి ఝాన్సీని గెలిపించుకునేందుకు ముమ్మర కార్యాచరణ సిద్ధం చేశారు. విశాఖ ఏపీ రాజధాని అని జగన్ ఏకంగా మేనిఫెస్టోలో ప్రకటించడంతో ఈ స్థానంలో గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారింది.

అయితే ప్రచారంలో ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ తనదైన శైలీలో ప్రచారం చేస్తు ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఆమె లేవనెత్తుతున్న అంశాలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి.

ఉత్తరాంధ్ర సమస్యలపై ఝాన్సీకి సమగ్ర అవగాహన ఉండటం, ఉన్నత విద్యావంతురాలు కావడం ఆమెకు మరింతగా కలిసి వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అసలు సామాన్యుల దగ్గరికే వెళ్లడం లేదని.. వాళ్లని దూరం నుంచే చూసుకుంటూ, కారు దిగకుండా చేయి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సిపై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం ఆమెకు కలిసివస్తుండగా ప్రత్యర్థుల బలహీనతలు కూడా బొత్సా ఝాన్సీకి మరింత ప్లస్‌గా మారనున్నాయి.

దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న బీసీలు, కాపులు, తూర్పు కాపులు, ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా కాపు సామాజికవర్గ నేతలకు ఇవ్వలేదు టీడీపీ. దీనికి తోడు జగన్‌…బొత్స ఝాన్సీకి సీటు ఇవ్వడంతోనే వార్ వన్ సైడ్ అయిందని టాక్ నడుస్తోంది. కాపు, తూర్పు కాపు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాలన్నీ ఒక తాటిపైకి వచ్చి బొత్స ఝాన్సీకి అండగా ఉండటంతో భరత్‌కు మరోసారి ఓటమి ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -