Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ గెలిస్తే 6…వైసీపీ గెలిస్తే 2!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. కొన్ని స్థానాల్లో గెలుపుపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి గజపతి నగరం. విజయనగరం జిల్లాపై పట్టు సాధించిన బొత్స తన మార్క్‌ను చూపేట్టేందుకు సిద్ధమయ్యారు.వాస్తవానికి టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవగర్గంలో గజపతినగరం ఒకటి.

వైసీపీ తరపున బొత్స అప్పలనర్సయ్య పోటీ చేస్తుండగా టీడీపీ కూటమి తరపున కొండపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలుపొందగా ఆరోసారి గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక వైసీపీ గత ఎన్నికల్లో విజయం సాధించగా ఈ సారి కూడా గెలిచి తీరాలనే కసితో ఉంది.

అధికారంలో ఉన్నప్పుడు చేప్టటిన పనులు ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సంక్షేమం కొనసాగాలంటే తనను మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు అప్పలనర్సయ్య. మంత్రి బొత్స సత్సనారాయణ రిలేటివ్ కావడంతో తన ప్లస్ పాయింట్ అని చెప్పుకొచ్చారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌పై ఉన్న నెగటివ్ టాక్ కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా గజపతినగరంలో ఓటర్లు ఎవరికి జై కొడతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -