Monday, May 6, 2024
- Advertisement -

చీపురుపల్లిలో ఎదురులేని బొత్స!

- Advertisement -

ఉత్తరాంధ్రలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి చీపురుపల్లి. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలు ఈ స్థానం నుండి నిలబడుతుండగా ఎవరు గెలుస్తారా అన్న టెన్షన్ అందరిలో నెలకొంది. రెండు లక్షల ఓటర్లు ఉన్న చీపురుపల్లి నుండి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీ నుండి కళా వెంకట్రావ్ పోటీ పడుతున్నారు.

వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరు బొత్స సత్యనారాయణ. అంతేకాదు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించగలిగిన నేత. 199లో బొబ్బిలి ఎంపీగా గెలిచిన బొత్స, ఆ తర్వాత 2004,2009లో చీపురుపల్లి నుండి గెలుపొందారు.2014లో ఓటమి పాలు కాగా 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో 26 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు బొత్స.

మంత్రిగా చీపురుపల్లిలో తనదైన మార్క్ చూపించారు బొత్స. చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ఇంటింటికీ మంచినీటి పథకంను అందించి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. అంతేగాదు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు సంపాదించారు. బొత్సాకు చెక్ పెట్టాలని టీడీపీ ఎంతగానో ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.

అందుకే ఈసారి సీనియర్ నేత కళా వెంకట్రావ్‌ను పోటీలోకి దించింది.1983 నుంచి రాజకీయాల్లో ఉన్న కళా… మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో కళా సామాజికవర్గం ఎక్కువగా ఉండటం కాస్త కలిసివచ్చే అంశమని భావిస్తున్న బొత్స బలం ముందు అది ఏ మేరకు ఫలిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. దీనికి తోడు వైసీపీ శ్రేణులన్ని బొత్సను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో నాలుగోసారి చీపురుపల్లిలో బొత్స గెలుస్తారా లేదా కళా వెంకట్రావ్ ను విజయం వరిస్తుందా అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -