Monday, May 20, 2024
- Advertisement -

బాబుకు రిలీఫ్ లభిస్తుందా?

- Advertisement -

కేసు లేదు, ఆధారాలు లేవని టీడీపీ అంటోంది కానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ స్పష్టంగా చెబుతోంది. వెరసీ బాబు రిమాండ్‌లో ఉండబట్టి నెల రోజులు దాటింది. సెప్టెంబర్ 11 నుండి బాబు రిమాండ్‌లో ఉండగా మూడోసారి ఆయన రిమాండ్‌ని అక్టోబర్ 19 వరకు పొడగించింది. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అంగళ్ళు ఇలా పలు రకాల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు చంద్రబాబు. గత కొన్నాళ్లుగా ఈ కేసులపై కోర్టుల్లో విచారణ జరుగుతుండగా బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఒకానొక దశలో బాబు బయటకు రావడం కష్టమనే అంతా చెబుతున్న పరిస్థితి. అయితే అమరావతి రింగ్ రోడ్ స్కామ్ మద్యంతర బెయిల్ మంజూరు కాగా అంగళ్ళు కేసులో కోర్టు ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయరాదని సీఐడీని ఆదేశించింది ధర్మాసనం. అలాగే ఏసీబీ కోర్టులోని పీటీ వారెంట్లపై కూడా స్టే విధించింది. దీంతో బాబుకు కాస్త రిలీఫ్ దక్కగా ఈ శుక్రవారం బాబు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుండగా బెయిల్ రావడం పక్కా అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

దీనికి తోడు లోకేష్ హస్తినలో కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఇక అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలను వివరించారు. ఇక షాతో భేటీ తర్వాత లోకేష్‌లో ఆనందం నెలకొనగా ఈ శుక్రవారం బాబు రిలీజ్ ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి బాబుకు రిలీఫ్ లభిస్తుందా లేదా అన్నది తెలియాలంటే శుక్రవారం వరకు వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -