టాలీవుడ్ లో పటాస్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నాడు. వరుస హిట్స్ అందుకుంటున్న అనీల్ రావిపూడి కి బాలయ్యతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట.. ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూలో తెలిపారు. నిజానికి బాలయ్య సినిమాతోనే దర్శకుడిగా మారాలని అనిల్ అనుకున్నాడట. కానీ అనుకోకుండా కళ్యాణ్ రామ్ పటాస్ తో దర్శకుడిగా మారి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
బాలకృష్ణతో సినిమా చేయాలని అనిల్ చాలారోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఆ మధ్య కథ కూడా వినిపించిన అనిల్ రామారావుగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా చెప్పారు. తర్వాత ఆయన తనయుడు మోక్షజ్ఞ తో మరో చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించారు.
కానీ ఈ రెండు ప్రాజెక్టులు మరుగున పడ్డాయి. ఇప్పుడు మరోసారి బాలయ్యతో కథా చర్చలు నడుస్తున్నాయని.. దాదాపుగా బాలయ్య అనిల్ స్టోరీ లైన్ కు ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎఫ్-3 పూర్తిచేసుకొని బాలయ్య కథను సిద్ధం చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే ఎట్టకేలకు దర్శకుడు అనిల్ రావిపూడి కల నెరవేరినట్లే అవుతుంది.
నితిన్ ‘మాస్ట్రో’ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!
తెలంగాణలో కరోనా డేంజర్ వేవ్.. ఒక్కరోజే 20 మంది మృతి!