ఏడాదిలో మినిమమ్ మూడు సినిమాలు చేసే మాస్ మహారాజా రవితేజ.. బెంగాల్ టైగర్ రిలీజయ్యి ఏడాది దాటినా ఒక్క సినిమా కూడా పట్టాలెక్కించలేకపోయాడు. మధ్యలో కొన్ని కథలు ఓకే చేశాడని, త్వరలో షూటింగ్ జరగనుందని వార్తలు వచ్చినా అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.
కాగా రవితేజ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. బెంగాల్ టైగర్ సినిమాలో తమ అభిమాన హీరో బాగా చిక్కిపోయాడని, ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కన్పిస్తోందని పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని కాస్త సీరియస్ తీసుకున్న రవితేజ మునపటి గ్లామర్ ని, ఛామింగ్ ని సంపాదించుకోవడం కోసం ఫారెన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. ఫ్యూచర్ లాంగ్ రన్ మెయిన్టేనెస్ కోసమని ఓ క్రమబద్దమైన ఫార్ములా పాటిస్తూ గత కొంతకాలంగా శరీరంపై శ్రద్ద పెట్టడంతోనే వరల్డ్ టూర్ ముగిసినా ఇంకా ఇండియాలోకి అడుగుపెట్టకుండా ఇంకా అదే ట్రైనింగ్ ని కంటిన్యూ చేస్తున్నాడట. త్వరలోనే ఆ ట్రీట్ మెంట్ నుండి అతను డిశ్చార్జ్ కానున్నాడని, ఇండియాకి రాగానే అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.
Related