Monday, April 29, 2024
- Advertisement -

అనుష్క పెళ్లి ఇండస్ట్రీ వ్యక్తితో కాదు..!

- Advertisement -
anushka shetty marriage news

సౌత్ ఇండియాలో తిరుగులేని క్రేజ్ సంపాధించుకుంది అందాల భామ అనుష్క. మూడు ప‌దుల వ‌య‌సు దాటినా ఈ అమ్మడి స్టార్ డ‌మ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్ ఎంతమంచి వస్తున్నా, అనుష్క ప్లేస్ ను ఇంచు కూడా క‌దిలించ‌లేక‌పోతున్నారు.

హీరోయిన్ ఓరియేంటేడ్ సినిమాలకు ఇప్పటికి అనుష్క‌కే ఫ‌స్ట్ అవకాశం. అయితే.. అనుష్క దృష్టి ఇప్పుడు పెళ్లిపై మ‌ళ్లింది. పెళ్లిచేసుకొని జీవితంలో స్థిర‌ప‌డాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసింద‌ని అనుష్క స‌న్నిహితులు చెబుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుష్క పై చాలా రూమర్లు గాసిప్ లు వచ్చాయి. చాలా మంది హీరోలతో ఆమెకి లింకులు పెట్టారు. అయితే అనుష్క మాత్రం తన క్యారెక్టర్ ఏమిటో ప్రతీసారి రుజువుచేస్తూనే వచ్చింది. గాసిప్పులను కాలానికే వదిలేసింది. ఆ గాసిప్పులు కూడా గాసిప్పులు గానే మిగిలిపోయాయి.

ఇటివల అనుష్క పెళ్లిపై మరో గ్యాసిప్పు పుట్టుకొచ్చింది. ఇండస్ట్రీకే చెందిన ఓ ప్రొడ్యూసర్ ని ఆమె చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ గాలి కబుర్లు గాని మిగిలిపోయాయి. అయితే తాజా సమచారం ప్రకారం…. పెళ్లిచేసుకొని సెటిల్ అవ్వడానికి నిర్ణయం తీసుకుందంట అనుష్క. ఇది కన్ఫర్మ్. అయితే ఆమె పెళ్లి ఇండస్ట్రీ వ్యక్తితో మాత్రం కాదట. ప్రస్తుతం అనుష్క తగిన సంబధాలు చుస్తున్నారట. త్వరలోనే తనకు కాబోయే వరుడ్ని ఎంచుకోబోతుందట. ప్రస్తుతం బాహుబలి 2 లో అనుష్క నటిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనుష్క పెళ్లిపై ఓ ప్రకటన వస్తుందని అంటున్నారు.

Related

  1. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?
  2. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. అనుష్కను బాధపెడుతున్న తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -