‘రారండోయ్ వేడుక చూద్దం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో సీనియర్ నటులు చలపతి రావు ‘అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారని ‘ కామెంట్ చేశారు. ఆ సమయంలో అక్కడున్న వారు ఏవరూ పెద్దగా కామెంట్ చేయకపోయానా..తర్వాత సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.
{loadmodule mod_custom,Side Ad 1}
దీంతో వెంటనే ఆయన కొన్ని చానల్స్ లో మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు.అయితే దీనిపై కొంత మంది ఇండస్ట్రీకి చెందిన వారు నెగిటీవ్ గా మాట్లాడితే..కొంత మంది ఆయనకు మద్దతు ఇచ్చారు. నటి అపూర్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ కి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. చలపతిరావు ఆడవాళ్లంటే ఎంతో గౌరవమని, అయితే అతను మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. నిజంగా వారిపట్లు అనుచిత వైఖరితో మాత్రం కాదని క్యారెక్టర్ అర్టిస్ట్ నటి అపూర్వ అన్నారు.
ఆయన కొవ్వుతోనో, కామంతోనో అలా అనలేదని అభిప్రాయపడ్డారు.గత కొంత కాలంగా కొంత మంది హీరోయిన్లు తమపై లైంగిక వేదింపులు జరిగాయని అంటున్నారని అందులో వాస్తవం ఉందని కొంత మంది తాతయ్యల వయసులో ఉన్న వారు అమ్మాయిలను పక్కన కూర్చో బెట్టుకుని, వాళ్ల మీద చేతులు వేసి కబుర్లు చెబుతూ, విరామ సమయంలో గదిలోకి రమ్మని ఆదేశించే వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పింది. లైంగిక వేదింపులు గురిచేస్తూ పైకి మాత్రం చాలా సిన్సియర్లుగా బిల్డప్ ఇస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.
{loadmodule mod_custom,Side Ad 2}
చలపతిరావు గురించి కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వేళ, ఆయన మంచి మనసు ఎట్లాంటిదో కొంతమందైనా బయటకు వచ్చి చెబితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ‘ఆత్మహత్యాయత్నం చేసిన చలపతిరావు’ అంటూ వచ్చిన ఫేక్ న్యూస్ విని తన కళ్లలో నీళ్లు వచ్చాయని అపూర్వ చెప్పింది. దాంతో ఏదైనా కళ్ళతో చూసినప్పుడే నిజానిజాలు మాట్లాడండి అంటూ అపూర్వ చెప్పుకొచ్చారు.
{youtube}PBx9sdYZDy8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related