Friday, April 19, 2024
- Advertisement -

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ అలాంటిపని చేయగలవా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ దశ, దిశ మార్చడానికి కుటుంబ పార్టీలే అడ్డంకిగా ఉన్నాయని గురువారం ఓ మీడియా సమావేశంలో ఆయన చెప్పుకొచ్చారు. అయితే, నిజంగా బీసీలపై ప్రేమ ఉండే అలా మాట్లాడారా లేక ఎలాగూ తమకు అంత సీన్‌ లేదు కాబట్టి ఓ కామెంట్‌ చేస్తే సరిపోతుందని అనుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ని టార్గెట్‌ చేసేందుకే బీసీ సీఎం అనే టాపిక్‌ను వీర్రాజు తెరపైకి తీసుకొచ్చినట్టు కొందరు పొలిటికల్‌ విశ్లేషకులు చెప్తున్నారు.

పవన్‌.. సీఎం.. సీఎం!
పవన్ కల్యాణ్ పర్యటనల సందర్భంగా ఆయన అభిమానులంతా.. సీఎం సీఎం అంటూ సందడి చేస్తుంటారు. రెండు చోట్ల పోటీ చేసి గెలుపు రుచి చూడని నేత సీఎం అవుతారా? అని మీరు సందేహ పడాల్సింది ఏమీ లేదు. కానీ, పవన్‌ అభిమానులు అంతే. నమ్మడానికి కష్టంగా ఉన్నా పవన్ కూడా అభిమానుల్లో ఆ జోష్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. అది ఆయనకు ఇష్టమైన ఇష్టం కావొచ్చు. అయితే, ఆయా పర్యటనల్లో పవన్‌-వీర్రాజు కలిసి వచ్చినప్పుడు కూడా పవనే మా సీఎం అంటూ అభిమానులు గోల చేస్తుండటంతో.. వారిని అదుపు చేసేందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు బీసీ సీఎం అనే ప్రకటన చేసి ఉండొచ్చని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం మీద పవన్‌ కల్యాణ్‌ సీఎం అభ్యర్థి ఆశలపై బీసీ సీఎం ప్రకటనతో వీర్రాజు నీళ్లు చల్లినట్టే! ఒకవేళ వీర్రాజు ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటే జనసేన కార్యకర్తలు ఇక ముందు పవన్‌ సీఎం అనే నినాదాలు చేయకూడదు. అయినా కూడా వారి తీరు మారలేదు అంటే.. ఆయన మాటల్ని జనసైనికులు కామెడీగా తీసుకున్నట్టు. మరి కాకపోతే.. ఆలూ లేదు.. చూలు లేదు కొడుకు పేరు … ఏదో అన్నట్టు ఏమిటి ఈ ప్రకటనలు అని సోషల్‌ మీడియాలో వీర్రాజుపై సెటైర్లు పేలుతున్నాయి.

టీడీపీ షాకిచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ!

నిమ్మగడ్డ యాప్ కి షాక్.. అప్పుడే వద్దు..

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -