Thursday, May 9, 2024
- Advertisement -

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ మరో సారి ఆగ్రహం..!

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు ఎంత రసకందాయంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక పంచాయితీరాజ్ ఎన్నికల విషయంలో జరుగుతున్న గందరగోళంపై ప్రతిరోజు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతూనే ఉంది. తాజాగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అధిక ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ధోరణికి అనుగుణంగా ఏకగ్రీవాలు లేవని వ్యాఖ్యానించింది. అనుమతి ఇచ్చే వరకూ వాటి తుది ఫలితాల ప్రకటన నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఏకగ్రీవ ఫలితాల ప్రకటనతో ముందుకు సాగవద్దని సూచించింది. రెండు జిల్లాలో ఎన్నికల తీరుపై ఆయా కలెక్టర్లు వివరణాత్మక నివేదికలు పంపాలని ఆదేశించింది. వాటిని పరిశీలించాకే కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏకగ్రీవాల నేపథ్యంలో.. వైఫల్యాలు బయటపడితే చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

తెలంగాణాలో థియేటర్ లు మళ్ళీ ఎందుకు మూత పడుతున్నాయి?

రమ్యకృష్ణ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -