Monday, May 6, 2024
- Advertisement -

ఆరెంజ్ పండు తింటున్నారా.. అయితే మీకు తెలుసా ?

- Advertisement -

మనం రోజు ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాము. అయితే మనం తినే పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనలు ఉన్నప్పటికి.. అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగ పడతాయి. అసలు పండ్లను తినడం వల్ల మనకు చేకూరే లాభాలెంటి ? ఏ పండు ఏ ఏ సమస్యలను తగ్గిస్తుంది. ఇలాంటి విషయాలు మాత్రం చాలమందికి తెలియదు. కాగా మనం తినే పండ్లు మన శరీరం లోని ఎలాంటి సమస్యలను తగ్గిస్తాయి అనే దానిపై అవగాహన ఉండడం వల్ల సరైన సమయంలో ఆయా పండ్లను తింటూ ఆయా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాగా సీజన్ తో సంబంధం లేకుండా అన్నీ సీజన్స్ లో దొరికే నారింజ పండు ఉపయోగాలు తెలుసుకుందాం !

నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా దొరికే పండ్లలో నారింజ కూడా ఒకటి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇక ఈ పండులో విటమిన్ సి తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పీచు వంటివి కూడా పుష్కలంగా దొరుగుతాయి. ముఖ్యంగా గర్బిణి స్త్రీ లకు బాలింత లకు నారింజ పండు చాలా మేలు చేకూరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నారింజ పండ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగౌతుంది. అంతే కాకుండా చర్మాన్నిమృదువుగా ఉంచుతూ చర్మసమస్యలను దూరం చేస్తుంది. ఇక ఈ పండులో ఉండే న్యూట్రీషియన్స్ రక్తంలోని చక్కెర శాతాన్నితగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గాయాలు త్వరగా మానిపోవడంలో కూడా ఉపయోగ పడతాయి.

నారింజ పండులో ఉండే విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సమస్యలు అలాగే ఆర్థరైటిస్ వంటి వాటిని నియంత్రిస్తుంది. ఇంకా ఈ పండులో ఉండే కాల్సియమ్ ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంతో పాటు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అందువల్ల నారింజ పండు గాని లేదా రసం గాని డైలీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా.. జాగ్రత్త !

కడుపునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి !

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -