వెంక‌టేష్-శేఖ‌ర్ క‌మ్ముల క్రేజీ మువీ !

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ద‌ర్శ‌కుల‌లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఒక‌ర‌నే కంటే ఆయ‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకత ఏర్ప‌ర్చ‌కున్నార‌నే చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న తీసే ప్ర‌తి చిత్రం ఓ క‌ళాఖండం. ఈ సినిమాల‌లో ఎంత ఫీల్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల.. లవ్ స్టోరీ సినిమా తెర‌కెక్కించ‌డంలో బీజీ గా ఉన్నారు.

ల‌వ్ స్టోరీలో అక్కినేని నాగ్ చైత‌న్య‌, సాయిప‌ల్ల‌విలు హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా పూర్తి కావ‌డంతో శేఖ‌ర్ క‌మ్ముల త‌ర్వాతి సినిమా గురించే సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా ఆయ‌న త‌ర్వాతి చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

శేఖ‌ర్ క‌మ్ముల త‌ర్వాతి మూవీ విక్ట‌రీ వెంక‌టేష్‌తో తీయ‌నున్నార‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవ‌లే శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని వెంక‌టేష్‌కు వినిపించార‌ట‌. దీనిని ఇంప్రెస్ అయిన వెంకీ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మా‌చారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు మొద‌లు కానున్నాయ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం వెంకీ నార‌ప్ప‌, ఎఫ్ 2, దృశ్యం 2 చిత్రాల‌తో బీజీ గా ఉన్నారు. ఇవి పూర్త‌యిన వెంట‌నే శేఖ‌ర్ క‌మ్ముల‌, వెంకీ క్రేజీ కాంభో మూవీ ప‌ట్టాలెక్క‌నుంది.

ఈ సింపుల్ చిట్కాలతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి !

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -