రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

- Advertisement -

వెండితెర మ‌న్మథుడు కింగ్ నాగ‌ర్జున త‌న దైన స్టైల్ లో సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నేటి యంగ్ హీరోల‌కు తాను తీసిపోను అనే త‌ర‌హాలో నాగ్ త‌న సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. అయితే, నాగార్జున మ‌ళ్లీ రెండో ప్ర‌పంచ యుద్ధం చేయ‌బోతున్నాడు.

రెండో ప్ర‌పంచ యుద్ధం నాగార్జున చేయ‌డం ఏంటి? ఎప్పుడో క‌దా ఆ యుద్ధం ముగిసిపోయింది ! అనే క‌దా మీ ప్ర‌శ్న‌. అస‌లు విష‌యం ఏమిటంటే ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల హ‌వా న‌డుస్తోంది. దీంతో స్టార్ హీరోలు సైతం ఓవ‌ర్ ది టాప్ (ఓటీటీ)పై ఆస‌క్తి చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగా వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. కింగ్ నాగార్జున సైతం ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

- Advertisement -

ఒక‌టి కాదు రెండు భారీ ప్రాజెక్టుల‌తో ఓటీటీపై దుమ్మురేప‌డానికి నాగ్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో ఒక‌టి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ కాగా, మరొకటి 1980 నుంచి నేటి కాలం వరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిర్మిస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నార‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నాగ్ న‌టించిన వైల్డ్ డాగ్ చిత్రం వ‌చ్చే నెల 2న విడుద‌ల కానుంది.

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ !

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -