Monday, April 29, 2024
- Advertisement -

రాహుల్ వస్తే ప్రత్యేక హోదా.. తొలి సంతకం అదే !

- Advertisement -

ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా అంశం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటుంది. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ కు పునరాభివృద్ది విషయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఏపీ స్పెషల్ స్టేటస్ అంశం మరుగున పడింది. అయినప్పటికి ఆయా సందర్భాలలో ఏపీ రాజకీయ నేతలు స్పెషల్ స్టేటస్ అంశాన్ని కేంద్రం ముందు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయితే మొదట్లో ఈ స్పెషల్ స్టేటస్ అంశాన్ని దాటవేసిన మోడీ సర్కార్.. ఇక ఆ తరువాత ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

దీంతో స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావిచడమే మరచిపోయారు ఏపీ నేతలు. అయితే 2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికరంలోకి వస్తే రాహుల్ గాంధీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తారని.. ప్రధానిగా ఆయన చేసే తొలి సంతకం ఇదేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఏపీలోని కర్నూల్ మీదుగా రాహుల్ గాంధీ ” భారత్ జోడో యాత్ర ” సాగనుంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ పై విధంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదని చెప్పవచ్చు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ఉందనే విషయం కూడా మర్చిపోయారు.

ఈ నేపథ్యంలో ఏపీ మీదుగా సాగనున్న రాహుల్ యాత్రను ఏపీ ప్రజలు ఎలా స్వాగతిస్తారన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. అయితే ప్రత్యేక హోదా విషయంలో హామీ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి.. కాంగ్రెస్ తిరిగి అధికరంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయ నాయకులకు మాట మార్చడం కొత్తేమీ కాదు.. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కార్ తో పాటు, టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా మాట మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే స్పెషల్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకునే అవకాశం లేదనేది జగమెరిగిన సత్యం.

Also Read

జగన్ సార్.. ఈ విషయంలో సూపర్ !

టి‌ఆర్‌ఎస్ (TRS) చాప్టర్ క్లోజ్.. ఇక కే‌సి‌ఆర్ కు గడ్డుకాలమే !

బాబుతో బాలయ్య “UNSTOPPABLE”.. వెన్నుపోటు తెరపైకి వస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -