Saturday, May 4, 2024
- Advertisement -

ధృవ లో ఉన్న 8 సీక్రెట్ కి కారణం ఇదే?

- Advertisement -
Dhruva Number 8 Secret

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ధృవ. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించేస్తోంది. హై స్పీడ్ కదిలిపోతున్న విజువల్స్ అందరికీ తెగ నచ్చేసింది కూడా.

అయితే.. ఈ ట్రైలర్ లో ఎక్కువ ఫ్రేమ్స్ లోనే ఉన్నా.. అంత స్పష్టంగా కనిపించని కేరక్టర్ కుర్ర హీరో నవదీప్ చేశాడు. చరణ్ కి తోడుండే నలుగురు ఐపీఎస్ లలో ఒకడిగా ధృవలో కనిపిస్తాడు. ఈ చిత్రం హీరో-విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ అని.. ఆ కాన్సెప్ట్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అనే సంగతి ముందు నుంచే తెలుసు. ఇలా విలన్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయే పాత్ర నవదీప్ ది. చరణ్ కి తెలిసినా కాపాడలేకపోతాడు. విలన్స్ నవదీప్ ని ఎలా హింసలు పెడతారో ట్రైలర్ లో చూపించారు కూడా.

సినిమా మొత్తానికి ఆయువుపట్టుగా నిలిచే ఈ ఎపిసోడ్ లో.. నవదీప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ధృవ తర్వాత నవదీప్ రోల్ కి విపరీతంగా పేరు రావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇక ధృవ టైటిల్ లో చూపిస్తున్న నెంబర్ 8కి సంబంధిచిన సీక్రెట్ కూడా ఈ ఎపిసోడ్ కే లింక్ అయి ఉంటుందట. అసలా సీక్రెట్ కి మూలమే నవదీప్ అంటున్నారు.  నవదీప్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే కేరక్టర్ పడిందని చెప్పచ్చు.

Related

  1. రామ్‌చ‌ర‌ణ్‌కి ప్ర‌తిష్ఠాత్మక‌ పుర‌స్కారం
  2. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  3. రామ్ గోపాల్ వర్మని బెదిరించిల అఖిల్?
  4. షాకింగ్ చేస్తున్న రామ్ చరణ్ ఆస్థి వివరాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -