Thursday, May 16, 2024
- Advertisement -

డైరెక్టర్.. మ్యూజిక్ డైరెక్టర్ జీవితాన్ని అడవిపాలు చేశాడు…

- Advertisement -

ఒకటి రెండు చిన్న సినిమాలు చేసిన ఒక సంగీత దర్శకునికి ఊహించని ఒక పెద్ద సినిమా అవకాశం వచ్చింది.. ఇతని వర్కింగ్ స్టైల్, ట్యూన్స్ నచ్చి ఒక దర్శకుడు ఇతనికి మంచి అవకాశం ఇచ్చాడు.. ఇంచు మించు ఇద్దరు కొత్తవారే… సినిమా  ప్రారంభం అయ్యింది.. అటు ఇటు ఎటు చూసినా వీరి స్నేహం బలంగా అయింది..  షూటింగ్ పూర్తి అయ్యింది… RR కూడా బాగా కుదిరింది..(RR అంటే రీ రికార్డింగ్: నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్).

ఇతను హీరోనా.. పైగా ఆ హీరోయిన్ పక్కన అని పగలబడి నవ్వుకున్నారు.. కానీ ఆ దర్శకుడు ఎవరి నవ్వులని మాటలని వినిపించుకోలేదు.. సినిమా విడుదల అయ్యింది.. ఎవరూ ఊహించని విధంగా పెద్ద విజయం సాధించింది.. దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరో(కొత్త వాడే) హీరోయిన్ (ఒక్క హిట్ సినిమా చేసింది.. ) ఇక అందరూ full happy.. అందరికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. తమ next movie లో చేయమని అందరిని అడుగుతున్నారు.. ఇక మన సంగీత దర్శకునితో సహా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సినిమాలు వచ్చాయి.. అందులో నలుగురు ప్రొడ్యుసర్స్ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు.. ముగ్గురు చెక్కులు ఇచ్చారు.. కొందరు కథా చర్చలు చేస్తున్నారు.. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇతనే… ఆ హీరో మీద కూడా ఎంత మంచి సంగీతం ఇచ్చాడు..

next మన సినిమాకి ఇతనే మ్యూజిక్ డైరెక్టర్ అని up coming డైరెక్టర్స్.. ప్రొడ్యుసర్స్  అనుకున్నారు.. కట్ చేస్తే ఆ సంగీత దర్శకుడు thank god ఇక నేను సెటిల్ అయినట్లే.. ఇన్ని సం,, రాల నా కల నెరవేరుతుంది.. అనుకుని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.. ఏం జరిగిందో ఏమో తనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు అడ్వాన్స్ తిరిగి ఇమ్మన్నారు.. చెక్‌లు ఇచ్చినవారు తిరిగి తీసుకున్నారు.. కథా చర్చలు జరిపిన వారు phone lift చేయట్లేదు.. అసలు ఏం జరుగుతుందో  కూడా తెలియని పరిస్తితి..

అయ్యో దేవుడా అనుకుని చేసేది ఏమీ లేక ఇక పాత జీవితాన్నే జీవిస్తున్నాడు.. కొన్ని రోజుల తర్వాత ఒక భయంకరమైన నిజం తెలిసింది.. కొన్ని నెలలుగా తనతో కలిసి హ్యాపీగా వర్క్ చేసిన దర్శకుడే దీనికి కారణం.. అని.. ఇతని మైండ్ పని చేయలేదు.. ఆ దర్శకుడు పని గట్టుకుని ఇతనిపై bad ప్రచారం చేశాడట.. కొందరికి call చేసి చెప్పాడు.. కొందరిని కలిసి చెప్పాడు.. అతను మ్యూజిక్ డైరెక్టర్ గా వద్దు అని.. అందరు ఇతని మాట విని తనకి అవకాశం ఇవ్వలేదు.. ఆ సినిమాకి నంది అవార్డ్ కూడా వచ్చింది.

కాని మనోడికి ఒక్క అవకాశం కూడా రాలేదు.. ఇప్పటికి కూడా.. ఇంతకీ ఏం చెప్పి.. ఆ దర్శకుడు ఈ సంగీత దర్శకునికి సినిమాలు రాకుండా ఆపాడో ఎవరికి తెలియదు.. పోనీ ఈ దర్శకుడు కూడా తరువాత తీసిన ఒక్క సినిమా కూడా ఆడిందా అంటే అదీ లేదు.. అది వారమే ఆడింది… చెడపకురా చెడేవు అనే సామెత ఆ దర్శకునికి తెలుసో లేదో ఎందుకంటే ఆ దర్శకుడు ఇలా ఎందుకు చేస్తాడు.. అసలు తప్పు ఎవరిదో పైన ఆ దేవుడికే తెలుసు… ఇంతకి ఎవరా దర్శకుడు.. ఎవరా సంగీత దర్శకుడు… just think….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -