Monday, April 29, 2024
- Advertisement -

హోదా రాదు..పోలవరం పూర్తి కాదు : కేంద్రం

- Advertisement -

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రెండిటినీ ప్రధానంగా కోరుకుంటున్నారు. అందులో ఒకటి ప్రత్యేక హోదా అయితే మరోటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం. అయితే ఈ రెండు నెరవేరఎడం ఏపీ ప్రజలకు ఎప్పటికప్పుడు కలగానే మిగిలిపోతుంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామంటూ గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కల్లబొల్లి కహానీలు ప్రజలకు ఎన్నో వినిపించారు. కానీ స్పెషల్ స్టేటస్ మాత్రం తీసుకొచ్చింది లేదు. ఎప్పటికప్పుడు స్పెషల్ స్టేటస్ ప్రస్తావన కేంద్రం వద్ద పెడుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికి, కేంద్రం మాత్రం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది. .

తీర ఒకానొక సమయంలో ఏపీకి అసలు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని తెచ్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. ఏ రాష్ట్రనికి కూడా స్పెషల్ స్టేటస్ లేదని, ఏపీకి కూడా స్పెషల్ స్టేటస్ అవసరం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది కేంద్రప్రభుత్వం.. దాంతో వైసీపీ సర్కార్ కూడా కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ విషయంలో అడగడం మానేసింది. ఇక చేతకాని ప్రభుత్వాలతో ప్రత్యేక హోదా సాధించలేమని ఏపీ ప్రజలు కూడా హోదా విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇక పోలవరం విషయానికొస్తే ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు. అప్పుడు పూర్తవౌతుంది ? ఇప్పుడు పూర్తవుతుంది ? అంటూ గాల్లో మాటలు చెబుతున్న ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తి అయిందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

దాంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా ప్రజలు లైట్ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈ రెండిటిపై కేంద్రం ప్రభుత్వం మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాస్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని, అసలు ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదంటూ షాక్ ఇచ్చారు. నిధుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రనికి కేంద్రప్రభుత్వం వనరులు అందిస్తోందని, వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు అనగా ఏపీ లాంటి రాష్ట్రాలకు గ్రాంట్స్ అందిస్తున్నాట్లు కేంద్రం మంత్రి చెప్పుకొచ్చారు.

దీంతో ప్రత్యేక హోదా ఏపీ ఇచ్చే ప్రసక్తే లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఇక పోలవరంపై కూడా ఆసక్తికర సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సుభాష్ చేంద్రబోస్ పోలవరం గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం పోలవరం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని, కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. వివిధ కారణాల దృష్ట్యా గడువు లోపల ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో పోలవరం వచ్చే ఏడాదైనా పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యతమౌతున్నాయి. మొత్తానికి ఏపీ ప్రజలు ఆశిస్తున్న స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నెరవేరతాయో మరి.

ఇవి కూడా చదవండి

పవన్ బస్సు యాత్ర.. వైసీపీలో గుబులు !

వైసీపీపై కుట్ర.. నిజమేనా ?

పొత్తులపై జనసేన క్లారిటీ.. ఎప్పుడంటే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -