Sunday, April 28, 2024
- Advertisement -

గాడ్ ఫాదర్ కూడా చిరుకు షాక్ ఇచ్చిందా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్ “. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 5 గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని హిట్ దిశగా అడుగులు వేసింది. అయితే మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టడంలో మాత్రం కాస్త తడబాటుకు గురైంది. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం రూ.13 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ కలెక్షన్స్ చిరు గత డిజాస్టర్ మూవీ ” ఆచార్య ” కన్నా తక్కువే. అయితే లాంగ్ వీకెండ్.. అలాగే పండగ సీజన్ కలిసి రావడంతో ఆదివారం వరకు మూవీ కలెక్షన్స్ స్టేడిగానే కొనసాగాయి. .

కానీ సోమవారం నాటికి కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించినట్లు టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదైన కలెక్షన్లు కేవలం రూ. 1.4 కోట్ల షేర్ మాత్రమే. ఇక గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించుకుంది. మూవీ పెట్టుబడి రాబట్టినప్పటికి మండే నుంచి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడంతో బయ్యర్లకు షాక్ తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత ” గాడ్ ఫాదర్ ” తో చిరు హిట్ ట్రాక్ ఎక్కినప్పటికి.. ఆశించిన స్థాయి విజయం కాదనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

Also Read

శ్రీను వైట్ల కొత్త ప్రయోగం.. ఫలించేనా ?

బాలయ్య, బోయపాటి.. ఈసారి ఇండియా షేక్ అవ్వాల్సిందే !

ఆ టైటిల్ మహేశ్ కు నచ్చలేదా.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -