తెలుగు రాష్ట్రాలలో హైపర్ ఆది అనే పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. బుల్లితెరపై హైపర్ ఆది చేసే కామెడీకి జనలు పగలబడి నవ్వుకుంటున్నారు. జబర్ధస్త్ ప్రోగ్రాంతో ఒక్కసారిగా ఫాపులర్ అయిన ఆడి.. తన పంచ్ లతో పగలబడి నవ్వేలా చేస్తున్నాడు. మొదట అదిరే అభి టీంలో చేసిన ఆదీ.. అభికి వరుసగా స్కిట్ రాసివ్వడంతో తనలో ఉన్న టాలెంట్ గుర్తించి సెపరేట్ టీం పెట్టించేశారు.
{loadmodule mod_custom,GA1}
ఈ నెపథ్యంలో ఆది.. తన పంచ్ లతో అడపాదడపా కాస్త లిమిట్ క్రాస్ చేస్తాడని అనిపిస్తుంది. ఈ మధ్య మనోడు ఫుల్ ఫాంలో ఉండటం.. ఆది స్కిట్ తోనే జబర్దస్థ్ నడుస్తుంది అన్న ఇమేజ్ రావడంతో.. మనవాడు మరింత రెచ్చిపోయి స్కిట్స్ చేస్తున్నాడు. వెబ్ సైట్లలో కూడా ఆది గురించి ప్రస్థావించడం స్టార్ హీరో ఆదికి వార్నింగ్ ఇచ్చాడని.. ఓ సీరియల్ హీరోయిన్ తో ఆది పెళ్లని హడావిడి చేశారు. ఈ వార్తలపై తన మార్క్ పంచులను వేశాడు ఆది. ఇటివలే జరిగిన జబర్దస్థ్ షోలో హైపర్ ఆది పులిహోర స్కిట్ వేశాడు. అందులో భాగంగా.. టీం మెంబర్ అయినటువంటి.. గణపతి.. ఈ మధ్య మీ మీద రూమర్స్ ఎక్కువయాయని అంటాడు. ఇక దానికి హైపర్ ఆదీ క్లారిటీ ఇస్తూ.. ఒకప్పుడు పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా.. ఉప్పని రాసేవారని.. ఇప్పుడు ఉప్పు డబ్బా మీద పంచదార అని రాసి మా లాంటి వారిని టార్గెట్ చేస్తున్నారని పంచ్ వేశాడు.
{loadmodule mod_custom,GA2}
వెబ్ సైట్ల మీద ఆదికి ఉన్న కోపంను.. స్కిట్ లో ఆది చెప్పిన డైలాగ్ చూస్తే అర్ధమవుతుంది. ఆదికి క్రేజ్ రావడంతో అతని షోని లక్షల్లో చూస్తున్నారు. అయితే ఇంతమంది చూస్తున్న షోలో ఆది తన పంచ్ లు డబుల్ మీనింగ్ డైలాగులు తగ్గించకపోవడం ఆశ్చర్యకరం. వెబ్ సైట్లకు ఆర్జీ పెట్టుకున్నాడో.. లేక.. నేనింతే అని ధీమా వ్యక్తం చేశాడో తెలియదు కానీ.. వెబ్ సైట్ల మీద మాత్రం గురి పెట్టినట్లు కనిపిస్తోంది.
{youtube}65xLOhzr5Ow{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related