ఇన్నర్ న్యూస్: చెన్నై చిన్న‌ది ఎమ్మెల్యేగా పోటీచేస్తుందా…?

- Advertisement -
inner news: Samantha to Contest from Secunderabad assembly 2019

చెన్నై చిన్న‌ది, అక్కినేని ఫ్యామిలీ కాబోయే కోడ‌లు టీఆర్ఎస్‌లో చేరుతుంద‌న్న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా అడ‌పా ద‌డ‌పా వ‌స్తూనే ఉన్నాయి. స‌మంత ఎప్పుడైతే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైందో అప్ప‌టి నుంచి ఈ వార్త‌లు జోరుగానే వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల బ‌రిలో స‌మంత టీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంద‌ట‌.

2019 ఎన్నిక‌ల్లో స‌మంత‌ను త‌మ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యే రేసులో ఉంచ‌డానికి మంత్రి కేటీఆర్ ఫిక్స‌యిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. ఆమెను సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని కేటీఆర్ కేసీఆర్ వ‌ద్ద ఇప్పటికే ప్ర‌తిపాద‌న‌లు పెట్టార‌ట‌. 2009 ఎన్నిక‌ల్లో ఇదే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ గెలుపొందారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ మంత్రి ప‌ద్మారావు ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్నారు.

స‌మంత‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దింపితే ప‌ద్మారావును ప‌క్క‌నే ఉన్న ముషీరాబాద్ నుంచి బ‌రిలో దింపేందుకు కేటీఆర్ ప్లాన్లు వేస్తున్నార‌ట‌. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క్రిస్టియ‌న్ ఓట్లు ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే క్రిస్టియ‌న్ అయిన స‌మంత‌ను ఇక్క‌డ నుంచి బ‌రిలో దింపితే గెలుపు ఈజీ అన్న నిర్ణ‌యానికి టీఆర్ఎస్ వచ్చేసింద‌ట‌. ఇప్ప‌టికే తెలంగాణ చేనేత వ‌స్త్రాల బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దూసుకుపోతోన్న స‌మంత‌కు ఇక్క‌డ మంచి క్రేజ్ వ‌స్తోంది.

ఆమె త‌మ పార్టీలో చేరితే త‌మ పార్టీకి సీనీగ్లామ‌ర్ తోడ‌వ్వ‌డంతో పాటు స‌మంత ఎఫెక్ట్‌తో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో చాలా సీట్లు గెల‌చుకోవ‌చ్చ‌నే మాస్ట‌ర్ ప్లాన్‌తో కేటీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక స‌మంత అక్కినేని కోడలుగా మారుతుండగా సినిమాలకు గుడ్ బై చెప్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమెను పాలిటిక్స్‌లోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Related

 

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -