Wednesday, April 24, 2024
- Advertisement -

కాటమరాయుడు మూవీ రివ్యూ

- Advertisement -
Katamarayudu Movie Review

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పవన్ తాజాగా  తమిళనాట విజయం సాధించిన ‘వీరమ్‌’ కథలో తనకు కావల్సిన అన్ని అంశాలూ ఉన్నాయని గ్రహించారు. అందుకే ఈ సినిమాని రీమేక్‌ చేసే బాధ్యత దర్శకుడు డాలీకి అప్పగించారు.

మరి పవన్‌ నమ్మకం నిజమైందా? డాలీ తన బాధ్యతను ఎంత వరకూ నెరవేర్చారు..? అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

కాటమరాయుడు(పవన్‌ కల్యాణ్‌)కి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు). వాళ్లంటే రాయుడికి ప్రాణం. వూరికి పెద్దగా.. పేదోళ్ల పాలిట దేవుడిగా రాయుడ్ని కొలుస్తుంటారు గ్రామస్థులు. వాళ్ల‌కి ఏ ఆప‌ద వ‌చ్చినా రాయుడు అండగా నిలబడతాడు. ఇంత మంచి రాయుడికి ఓ బలహీనత కూడా ఉంది. తనకు అమ్మాయిలంటే పడదు. అందుకే పెళ్లీడు వచ్చి దాటిపోతున్నా… పెళ్లి మాటెత్తడు. అన్నయ్యకు పెళ్లికాకపోతే తమ్ముళ్లకెందుకు అవుతుంది? వాళ్లకు అమ్మాయిలు, పెళ్లి, సంసారం లాంటి కలలున్నా… అన్నయ్య కోసం తమ కోరికల్ని, ఆశల్ని చంపేసుకొంటారు. ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శ్రుతిహాసన్‌) ప్రవేశిస్తుంది. అవంతిక ఎవరు? ఆమె వల్ల రాయుడి జీవితంలోకి ఎలాంటి అనూహ్యమైన మార్పులొచ్చాయి? తమ్ముళ్ల ప్రేమకథలు ఎలా మొదలయ్యాయి? అనేదే ‘కాటమరాయుడు’ కథ.

ప్లస్ పాయింట్స్ :

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరమ్‌’కి రీమేక్‌ ఇది. కొత్త మలుపులు, కొత్త క్యారెక్టరైజేషన్‌ల జోలికి వెళ్లలేదు. ఇక పవన్ కళ్యాణ్ పై వచ్చే ప్రతి సీన్ అందరికి నచ్చుతుంది. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలానే తెరపైకి కనిపిస్తారు. సినిమా ప్రారంభం.. నడవడిక పవన్‌ కల్యాణ్‌ను పరిచయం చేసిన పద్ధతి ఇవన్నీ అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా పవన్‌, శ్రుతిహాసన్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లవ్‌ ట్రాక్‌పై వీరమ్‌ దర్శకుడు శివ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ డాలీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అందుకే పవన్‌ గత చిత్రాల కన్నా ఎక్కువ రొమాంటిక్‌గా కనిపిస్తాడు. వినోదం కూడా అద్భుతంగా ఉంది. తమ్ముళ్లతో అన్నదమ్ముల సన్నివేశాలు, అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే యత్నాలు.. మధ్య మధ్యలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. వీటితో ప్రథమార్ధం సాఫీగా సాగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్‌కల్యాణ్‌ కోసం.. ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. శ్రుతిహాసన్‌ అందంగా కనిపించింది. పాత్ర పరిధి మేరకు రాణించింది. తమ్ముళ్లు నలుగురు ఉన్నా… అజయ్‌, శివబాలాజీల పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం కన్పించింది. రావురమేష్‌ పాత్ర‌ ఆకట్టుకుంది. ఎపిసోడ్స్‌లో వినిపించే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అన్పిస్తుంది

మైనస్ పాయింట్స్ :

ద్వితీయార్థం కాస్త నిదానంగా సాగుతుంది. డ్యాన్స్‌ల విషయంలో పవన్‌ మరింత దృష్టి పెడితే బాగుండేది. తరుణ్‌ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేదు. పాటలు కూడా మరి ఓ రెంజ్ అని చెప్పేలా లేవు. అక్కడ అక్కడ కొన్ని సీన్స్ సాగినట్లు అనిపించింది.

మొత్తంగా :

అత్తారింటికి దారేది తర్వాత పవన్‌కల్యాణ్‌లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించింది. పవన్‌కల్యాణ్‌ నటన.. అలానే సినిమాలో వచ్చే లవ్‌ట్రాక్‌.. అన్నదమ్ముల మధ్య వచ్చే అనుబంధం ఈ సినిమాలో ప్లస్ గా కనిపించగా.. ఇక మైనస్ పాయింట్స్ గా సెకండ్ ఆఫ్ లో స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.. అనూప్ సంగీతం పై మరింత దృష్టి పెడితే బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వీర‌మ్ క‌థ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను జోడించి అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కింది.

{youtube}WQN6MaMNhh8{/youtube} 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -