Sunday, May 5, 2024
- Advertisement -

రాజ్యాంగం ఎంతో గొప్పదన్న జగన్.. ఏకీపారేస్తున్న నెటిజన్స్!

- Advertisement -

200 ఏళ్ల బ్రిటిష్ వారి పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత.. దేశ ప్రజలను ఒకే తాటిపైన నిలిపేందుకు డా. బిఆర్ అంబేద్కర్ ఆయన బృందంతో కలిసి మనకు రాజ్యాంగాన్ని అందించారు. ప్రస్తుతం దేశంలో సమానత్వం, లౌకికత్వం ఎంతో కొంత ఉన్నాయంటే.. అది అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగం చలువే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మనదేశంలో రాజ్యాంగం ఆవిర్భవించి నేటికీ 72 సంవత్సరాలు. దాంతో నాడు రాజ్యాంగాన్ని మనకిచ్చిన అంబేద్కర్ ను గుర్తుకు చేసుకుంటూ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తుకు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, మనకు క్రమంశిక్షణ నేర్పుతున్న పుస్తకం అని సి‌ఎం జగన్ అన్నారు. ఇక 72 ఏళ్లుగా రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరసిందని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని పేరుకొన్నారు. ఇక తమ ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిందని అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలు పారదర్శికంగా అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే సి‌ఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. సి‌ఎం జగన్ పరిపాలన రాజ్యాంగం ప్రకారం కాదని, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఆంధ్రలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడంపై కూడా స్పందిస్తూ.. ఇదేనా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు మీ ప్రభుత్వం ఇచ్చే విలువ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. మొత్తాని రాజ్యాంగం ఆవిర్భావ రోజున జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?

ఎమ్మెల్యేలు జర జాగ్రత్త..కొడుతుండ్రూ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -