మాజీ మిస్ యూనివర్్స, బాలీవుడ్ తార సుస్మితా సేన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండే ఫొటోలు తరచుగా షేర్ చేసే ఈ భామ.. తాజా పోస్టులో ఓ కోట్‌తో సుస్మిత మరోసారి బ్రేకప్ చెప్పేసిందంటూ గాసిప్‌లు గుప్పుమంటున్నాయి. బ్యూటీక్వీన్ అయిన సుస్మిత గతంలో చాలా మందితో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం కశ్మీరీ మోడల్ రోహమన్ షాల్‌తో లవ్‌లో పడ్డట్టు తాజ్‌మహల్ దగ్గర దిగిన ఫొటోతో సింబాలిక్‌గా చెప్పింది.
తనతో పాటు తన దత్తత కూతుళ్లకు కూడా రోహమన్ ప్రేమ పంచుతున్నట్లు అనేక సందర్భాల్లో ఫొటోల ద్వారానే చెప్పుకొచ్చింది. దీంతో తన కంటే పదిహేనేళ్లు చిన్నవాడైన రోహమన్‌తో సహజీనం చేస్తున్న, సుస్మిత అతడిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపించింది. ఇందుకు ఇరు కుటుంబాలు కూడా ఒకే చెప్పినట్లు రూమర్లు ప్రచారమయ్యాయి.
అయితే ఇప్పుడు ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం. అసలు సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే.. అతడు మారతాడని స్త్రీ అనుకుంటుంది.. కానీ అది జరగదు.. ఇక పురుషులు చేసే తప్పేంటి అంటే ఆమె ఎప్పటికీ తనను విడిచి వెళ్లదు అనుకుంటాడు.. కానీ ఆమె వెళ్లిపోతుంది అని సుస్మిత ఓ పోస్టు పెట్టంది. దీంతో వీరు విడిపోయారని వార్తలు గుప్పుమంటున్నాయి.
జగన్.. చంద్ర బాబు ఒకే వేదిక మీద..!
వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఏమిటో ఏమిటో!?
నాయుడుబాబు లేఖలు రాస్తున్నాడు!