Wednesday, May 22, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జై ల‌వ కుశ‌ లో చేసే మూడు రోల్స్ ఇవే

- Advertisement -
Jai Lava Kusha NTR Three Rolls

నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎగ్జైటింగ్‌తో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ప్రారంభమైపోయింది. ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప‌వ‌ర్‌-స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్షన్ లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించే మూడు పాత్ర‌ల‌కు సంబంధించిన రోల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఈ మూడు పాత్రల్లో.. కవలలుగా రెండు పాత్రలు.. తండ్రి గా మరోటి అని తెలుస్తోంది.  అయితే ఇప్పుడు ఏకంగా ఒకే సినిమాలో మూడో రోల్స్‌…అందులోను రెండు క‌వ‌ల‌లు, మ‌రొక‌టి తండ్రి పాత్ర కావ‌డంతో కాస్త ఇంట్ర‌స్టింగ్‌గా ఈ స్టోరీ ఉండేలా ఉంది. ఇక అదుర్స్‌ సినిమాలో సైతం ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇది గ‌తంలో తమిళంలో అజిత్ నటించిన ‘వరలారు’ అనే సినిమా కథను పోలి ఉంటుందని అంటున్నారు.

కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అజిత్ మూడు పాత్రల్లో కనిపించాడు. 2006లో వచ్చిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా అయ్యింది. ఈ సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగ‌స్టు 11న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

{youtube}99BP9vkT944{/youtube}

Related

  1. టాప్ దర్శకుడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్!
  2. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..?
  3. ఎన్టీఆర్ గడ్డం పెంచడం వెనక కారణం ఇదే!
  4. అబ్బే.. ఎన్టీఆర్ ఏ మాత్రం మారలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -