Monday, June 17, 2024
- Advertisement -

న్యూస్ పేపర్ వేస్తూ చదువుకుంటున్న అమ్మాయి!

- Advertisement -

న్యూస్ పేపర్లు వేస్తూ చదువుకునే అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. కానీ ఈ కోవ కు చెందిన అమ్మాయిలను మనం చూసి ఉండం. అయితే ఇప్పుడు మనం పేపర్ వేస్తూ చదువుకుంటున్న ఓ అమ్మాయి గురించి తెలుసుకుందాం… అమృత్ సర్ కు చెందిన జమీలా ఆ కుటుంబంలో పెద్దమ్మాయి. తనకు చదువుకోవాలి అని ఆశ. కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేక చదువుకు కష్టం అయ్యింది.

ఇలాంటప్పుడు పొద్దున్నే ఇల్లిల్లూ తిరిగి పేపర్ వేస్తే కొంత డబ్బు సమకూరుతుంది. దాంతో చదువుకోవచ్చు అనుకుంది. అలా పదేళ్ళ నిర్ణయం తీసుకున్న జమీలా రోజూ సుమారు పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వివిధ వార్తాపత్రికల ఏజెన్సీల నుంచి పేపర్లు తీసుకుంటుంది. వర్షాలు కురిసినా, వరదలొచ్చినా ఆగకుండా తెల్లవారుజామునే లేచి ఇంటింటికీ పేపర్ అందిస్తోంది. సాయంత్రం టైంలో న్యూస్ పేపర్ వేయించుకోమని బుకింగ్ లు తీసుకుంటోంది. ఇక పగటిపూట అమృత్ సర్ యూనివర్సిటీ లో పిజి చదువుతోంది.

మొదట్లో జమీలా ఇలా బయటకు రావడం చూసి చాలా మంది రకరకాల మాటలనేవారు. తరగతిలోనివారు కూడా చిన్న చూపు చూసేవారు. కాని కష్టపడి పని చేస్తూ మంచి మార్కులు తెచ్చుకునే ఆమె అందరి అభిమానాన్ని చూరగొంది. నాకు చదువు అంటే ఇష్టం. చదువును, పనిని ప్రేమిసాను.. అందుకే ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోను. అమ్మా, నాన్నా, అక్కాచెల్లెళ్లు కడుపు నిండా భోజనం చేయగాలుగుతున్నారనే సంతృప్తి ఉంది నాకు అంటుంది జమీలా. 

ఇలాంటి అమ్మాయి గోప్పతనం అందరికి తెలియాలి కాబట్టి షేర్ చేయడం మరిచిపోకండి.

Related

  1. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  2. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?
  3. టాలీవుడ్ హీరోలు ఎంత వరకు చదివారంటే?
  4. ఈ లెటర్ చదివితే మీరూ ఏడుస్తారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -