Friday, April 26, 2024
- Advertisement -

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

- Advertisement -

ఒక టాప్ హీరోయిన్స్ ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉండీ కూడా స్టార్ గా మారడంలో విఫలం అయిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో కృతి కర్బందా ఒకరు, చూడ చక్కని మొఖం, పెర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ ఉన్న అతి తక్కువ భామల్లో కృతి కర్బందా ఉంటుంది. కానీ లక్ తన సినీ లైఫ్ లో బియ్యం గింజ అంత కూడా లేకపోవడంతో తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో ఫ్లాఫ్ స్టార్ గానే మిగిలిపోయింది అమ్మడు. తెలుగు లో తీన్ మార్, బ్రూస్ లీ, ఒంగోలు గిత్త సినిమాల్లో నటించింది.

అదే టైంలో బాలీవుడ్ పిలిచి మరీ అమ్మడికి చాన్స్ ఇచ్చారు. మోస్ట్ ఎరోటిక్ సిరీస్ లో ఒకటైన రాజ్ సిరీస్ 4వ పార్ట్ లో హీరోయిన్ గా అవకాశం దక్కింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో స్థిరపడింది. అయితే ఇప్పడు ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందట. వీరి అఫైర్ పై బీటౌన్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్త పై కృతి కర్బందా స్పందిస్తూ.. అవును మేమిద్దరం గతఏడాదిన్నరగా డేటింగ్ లో ఉన్నామని.. పులకిత్ మంచి వ్యక్తి అని.. ఇప్పట్లో పెళ్లి చేసుకోబోమని చెప్పింది. ప్రస్తుతం ఇద్దరం కెరీర్ పై దృష్టి పెట్టామని.. తమ గోల్ రీచ్ అవ్వగానే పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పింది.

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

శింబుతో త్రిష పెళ్లి జరగబోతుందా.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -