- Advertisement -

పాలిటిక్స్ లో మహేష్ బాబు ?

- Advertisement -

మహేష్ ఎన్నో రకాల పాత్రలలో నటించినా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమా ఇంతవరకు చేయలేదు. అంతేకాదు… మహేష్ బాబుకు స్వతహాగా కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదట. అందుకే ప్రిన్స్ తన సినిమాల ఎంపికలో కూడా పొలిటికల్ మూవీస్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.

అయితే మహేష్ బాబు ఇదివరకు ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడని లేటెస్ట్ గా ప్రచారం జరుగుతోంది. హీరోలంటే నాలుగు పాటలు, ఆరు ఫైట్స్ అనే రొటీన్ కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు ఆ ట్రాక్ లోవచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రిన్స్ మహేష్ ఆ ధోరణిని ప్రక్కన పెట్టి కొంతకాలంగా డిఫరెంట్ షేడ్స్ ఉండే కేరక్టర్స్ చేస్తున్నాడు. మాస్ కు నచ్చే యాక్షన్ హీరో రోల్స్ తో పాటు సైకలాజికల్, సోషల్ ఎవేర్ నెస్ కలిగించే పాత్రలలో నటిస్తున్నాడు. అయితే… ప్రిన్స్ ఇంతవరకు పూర్తి స్థాయి పొలిటికల్ పిక్చర్ చేయలేదు.

ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని అంటున్నారు. మహేష్ – కొరటాల చేయబోయే పిక్చర్ వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇది పొలిటికల్ మూవీ అని, ఈ సినిమా రాజకీయాల చుట్టూ తిరుగుతుందనీ అనుకుంటున్నారు. ఇందులో కరెంట్ పాలిటిక్స్ కు సంబంధించి ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. మరి పొలిటికల్ మూవీ కాబట్టి మహేష్ బాబు కేరక్టర్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటూ పంచ్ డైలాగ్స్ పడాలి.

పంచ్ డైలాగ్స్ ప్రిన్స్ కు కొత్త కాదు. మహేష్ బాబు, కొరటాల ఈ మూవీని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తారని అంటున్నారు.

Related

  1. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?
  2. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  3. పీవీపీ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు
  4. చరణ్ కి ఊహించని షాక్ ని ఇచ్చిన మహేష్ బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -