Thursday, May 16, 2024
- Advertisement -

ఏటీఎం వద్దకు వెళ్లకుండా.. డబ్బు తెచ్చుకుంటున్నారు!

- Advertisement -
ATM Money withdraw

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతైనా గంటల తరబడి బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద నిలబడడం అంటే మామూలు విషయం కాదని అందరికి తెలిసిందే. అయితే చెన్నైలోని ఖాతాదారులు, ఏటీఎం సెక్యూరిటీ గార్డులకు ఓ ఉపాయం తట్టింది.

ఏటీఎంలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారో ప్రజలకి తెలియడం లేదు కాబట్టి… డబ్బుని ఎప్పుడు జమ చేస్తారో సెక్యూరిటీ గార్డులకు పక్కాగా తెలుస్తుంది కాబట్టి… కస్టమర్లకు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్.. మాదిరిగా ప్రజల నుండి ఏటీఎం కార్డులు తీసుకుని, పిన్ నెంబర్లను అడిగి తెలుసుకుంటున్నారు. డబ్బు ఎప్పుడు నింపుతారో అప్పుడు వరుసగా డ్రా చేస్తున్నారు. ఇలా డబ్బు డ్రా చేసిన తర్వాత ఖాతాదారుడికి ఫోన్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకోడానికి రమ్మంటున్నారు.

ఈ పని చేసినందుకు ఎంతో కొంత కమీషన్ సుకుంటున్నారు. ఏటీఎం కార్డుతో పాటు పిన్ నెంబర్ కూడా ఇవ్వడం మంచిది కాదని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ ఖాతాదారులేమైనా పిచ్చివారా? బ్యాంకు ఖాతాలో లక్షలు ఉన్నా రోజుకి 2 వేలకు మించి డ్రా చేయలేరన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు తెలివిగా ఎక్కువ డబ్బుని డ్రా చేద్దాం అనుకున్నా అది కుదరని పని అని హాయిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

Related

  1. మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే పడింది!
  2. వచ్చే ఎన్నికల్లో మోడీ పరాజయం తధ్యం .. ఇందిరాగాంధీ లాగానే అట్టర్ ప్లాప్ !
  3. మోడీ సోదరిని అతనికిచ్చి పెళ్లి చెయ్యండి – రబ్రీ దేవి వివాదాస్పద వ్యాఖ్యలు
  4. మోడీ చేసిన పని టాటా కి కూడా నచ్చలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -