Monday, May 20, 2024
- Advertisement -

మహేష్ డైరెక్టర్ అట్టర్ ప్లాప్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు మురుగదాస్ తో మూవీ చేసేస్తున్నాడు. ఇంకా టైటిల్ సెట్ చేయలేదు కానీ.. ఓ వంద కోట్ల బడ్జెట్ కేటాయించి.. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ తీసేస్తున్నారు. ఇందులో మహేష్ పాత్ర న్యాయవ్యవస్థను నిలదేసేదిగా ఉంటుందనే టాక్ ఒకటి నడుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ అనుకున్నపుడు మహేష్ బాబు శ్రీమంతుడితో మంచి జోరు మీదున్నాడు. తీరా మూవీ పట్టాలెక్కేసరకి.. సూపర్ స్టార్ కి బ్రహ్మోత్సవం అంటూ సూపర్ ఫ్లాప్ ఒకటి వచ్చింది. డైరెక్టర్ మురుగదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మురుగదాస్ ఇంతకుముందు కత్తి అంటూ ఓ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. కోలీవుడ్ హిస్టరీలో బెస్ట్ హిట్స్ లో ఇది ఒకటి. ఇప్పుడు మురుగ డైరెక్షన్ లో వచ్చిన బాలీవుడ్ మూవీ అకీరా డిజాస్టర్ అంటున్నారు.

తొలి రోజున 5.15 కోట్ల కలెక్షన్స్ రాగా.. వీకెండ్ లో పుంజుకున్నాయి. దీంతో సక్సెస్ బాట పడుతుందనే అంచనాలు వచ్చాక.. వీక్ డేస్ లో ఘోరంగా చతికిలపడింది అకీరా. ఆర్రోజుల కలెక్షన్స్ కేవలం 24.5 కోట్లు మాత్రమే. సోనాక్షి సిన్హా నటించిన ఈ మూవీ కనీసం పెట్టుబడి కూడా రాబట్టలేదనే విషయం తేలిపోయింది. ఈ దెబ్బతో మురుగదాస్ కూడా డిజాస్టర్ తీసిన దర్శకుడు అయ్యాడు. అటు మహేష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే.. ఇద్దరూ కలిసి చేయనున్న చిత్రంపై మాత్రం మంచి అంచనాలే ఉండడం విశేషం.

Related

  1. మహేష్ కొత్త సినిమా స్టోరీ లీక్ అయ్యింది!
  2. మహేష్ ని ఆకాశానికెత్తేసిన మురుగదాస్!
  3. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  4. కృష్ణ – మహేష్ – గౌతం – మనం లాంటి సినిమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -